calender_icon.png 24 May, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ ఏర్పాటు చేయాలి

23-05-2025 08:58:00 PM

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ,(విజయక్రాంతి): అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయటమే అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) అన్నారు.  పరకాల మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ(Indian Red Cross Society Hanamkonda Branch) ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ స్టోరేజీ సెంటర్ శంకుస్థాపన, భూమి పూజ కార్యమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారిని బతికించవచ్చన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒక వైద్యురాలిగా రక్తం విలువ తనకు తెలుసని అన్నారు. అత్యవసర సమయాల్లో బ్లడ్ అందుబాటులో లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారని, ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రెగ్నెంట్ లేడీస్, పోస్ట్ డెలివరీ సమయాల్లో సైతం బ్లడ్ అవసరం ఉంటుందని తెలియజేశారు.

ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ జిల్లాలో  రెడ్ క్రాస్ ఉందని, భూపాలపల్లి జనగామ జిల్లాల్లో రెడ్ క్రాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ చాలా అవసరమని బ్లడ్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉంటే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నిర్వహణతో పాటు డ్రగ్ డిడిక్షన్ సెంటర్, ఆడపిల్లలకు రక్తహీనత పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఎంపీ వివరించారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ లో తలసేమియా ఐ సి ఎం ఆర్ పరిశోధన కేంద్ర ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. హనుమకొండ జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రా ఏర్పాటుకు సంబంధించి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ  సేవలను మరింత విస్తృతం చేయాలని ఎంపీ సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ  సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ విజయ్ చందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పరకాల హాస్పిటల్ సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్,  రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.