18 April, 2026 | 6:17 PM

పచ్చనూరులో ఓటేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతులు

15-12-2025 02:06 AM

మానకొండూర్, డిసెంబర్14(విజయక్రాంతి):రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం మానకొండూరు మండలంలోని పచ్చనూరులో సతీసమేతంగా ఓటు వే శారు.తన సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనురాధతో ఓటు వేసేందుకు ఉదయమే పచ్చనూరు చేరుకున్నారు.

గ్రామంలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో గల  9వ బూత్ లో ఎమ్మెల్యే దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తులు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకో వాలని, ఈ పంచాయతీ ఎన్నికల్లో సమర్ధులను, సరైన వ్యక్తులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని ఆయన కోరారు.