calender_icon.png 15 December, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలితం తేలని ఒక్క ఓటు!

15-12-2025 02:05:03 AM

  1. ఇద్దరు యువకుల మధ్య పోటాపోటీ 
  2. రికౌంటింగ్ చేయాలంటూ అధికారులకు వినతి

ఎల్లారెడ్డి, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో పోటాపోటీగా ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఇద్దరు యువకులు అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ, ఒక్క ఓటు తేడాతో ఇద్దరు అధికారులను రికౌంటింగ్ చేయాలంటూ కోరు తున్నారు. ఆదివారం రాత్రి పది గంటలయినప్పటికీ కౌంటింగ్ పూర్తి కాలేదు. ఒకేసారి యువకులు పోటీలో ఉండటం, ఇద్దరికీ ఒకే ఒక్క ఓటు తేడా రావడం పట్ల రికౌంటింగ్ చే యాలంటూ పట్టుబట్టారు. 507 ఓట్లు సిద్దు స్వామికి, 508 ఓట్లు యధగౌడ్‌కు రాగా.. ఒక్క ఓటుతో మార్పుకు నాంది పలుకనుందా తేలాల్సి ఉంది.