15-12-2025 02:06:33 AM
సూర్యాపేట, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : జిల్లాలోని పెన్ పహాడ్ మండలం భక్తళాపురం గ్రామపంచాయతీ జరిగిన ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జుట్టు కొండ యమునాగణేశ్ పోటీకి దిగారు. అలా గే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నల్లపు శేషలక్ష్మి రామ్మూర్తి పోటీలో నిలిచారు. ఇద్దరు ఒకే సామాజికవర్గం కావడం అదే సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండడానికి తోడు ఇరు పార్టీలు దాదాపుగా సమానంగా ఉన్నాయి.
దీంతో లెక్కింపు ప్రారంభం నుంచి నువ్వా.. నేనా అన్నట్లు పోటీ కొనసాగింది. దీంతో చివరికి యమునా గణేశ్‌కి ఒక్క ఓటు ఎక్కువ రాగా రీ కౌంటింగ్ పె ట్టారు. తిరిగి అదే ఫలితం రావడంతో అధికారులు ఆమెనే సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి నట్లు ప్రకటించారు.దీంతో ఒక్క ఓటే గెలిపించిందని ఓటు విలువ ఈ ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు చర్చించుకున్నారు. కాగా ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరకు ఒక్క ఓటుతో యమునా గెలుపొందడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.