మహోన్నత వ్యక్తి కారల్ మార్క్స్
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం, మే 5 (విజయక్రాంతి): బానిసత్వం నుంచి బయటపడేసి, శ్రమ దోపిడీ నుంచి కార్మికులకు విముక్తి మార్గం చూపిన మహనీయుడు కారల్ మా ర్క్స్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కారల్ మార్క్స్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరి కీ సమాన అవకాశాలు కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయ న సిద్ధాంతాలు ఆచరణీయమని, ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు శేషయ్య, వంగా వెంకట్, వీరస్వామి, మల్లికార్జున్, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, మునిగ డప పద్మ వెంకటేశ్వర్లు, భూక్యా శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




