13 March, 2026 | 12:07 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

02-08-2024 10:41 AM

హైదరాబాద్‌: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆయన నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ ప్రచారంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.