13 March, 2026 | 4:15 AM

నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి తోడ్పడాలి

13-03-2026 12:06 AM

కామారెడ్డి, మార్చి 12 (విజయ క్రాంతి): భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా అభివృద్ధి పథం లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముందుండాలి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ లకు, ప్రజా పాలనపై  అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా సర్పంచ్, కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా పాల్గొని దిశా నిర్దేశం చేశారు. 06 మార్చి 2026 నుండి 12 జూన్ 2026 వరకు అమలు చేయనున్న .

ఈ కార్యాచరణ ప్రణాళిక పై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జయ జయ హే తెలంగాణ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని తెలిపారు.

ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్,   మధు మోహన్,  చైర్మెన్ లు,వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు  ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.