25-09-2025 03:09:24 PM
చంద్రం మృతికి భాస్కర్ రెడ్డి కారణమని ఆరోపణ
భాస్కర్ రెడ్డి ఇంట్లో చంద్రమృతదేహంతో నిరసన
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉద్రిత్త వాతావరణం నెలకొంది.గ్రామానికి చెందిన కత్తుల భాస్కర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన పాలోజు చెంద్రంకు చెందిన వ్యవసాయ భూమిని అప్పు కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తిరిగి అప్పు చెల్లిస్తా నా భూమి నాకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయమని చంద్రం కోరగా భాస్కర్ రెడ్డి చేయనని చెప్పడంతో అలాగే చంద్రం వ్యవసాయ పనులు చేయకుండా ఉండాలని ఈ భూమిలోకి రావద్దు అని అనడంతో మనస్థాపనికి గురైన పోలోజు చంద్రం ఒక్క సారిగా బీపీ పెరగంతో గుండెపోటుకు గురై చనిపోయాడని ఆరోపిస్తూ చంద్రం శవం తో కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శవాన్ని భాస్కర్ రెడ్డి ఇంట్లో వేసి భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేసి,బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.సంఘటన స్థలానికి చేర్యాల సీఐ శ్రీను, ఎస్సై నవీన్ చేరుకొని ఆందోళన కారులకు నచ్చచెప్పిన వినకపోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. మృతునికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.