15 August, 2026 | 12:55 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

15-08-2026 12:11 AM

పట్టణాభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే మల్రెడ్డి సమీక్ష

ఆదిబట్ల, ఆగస్టు 14 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడ మే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం  ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం తొర్రూర్లోని క్యాంపు కార్యాలయంలో ఆదిభట్ల సర్కిల్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో పట్టణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీలు, నాలాల పూడికతీతను వేగవంతం చేయడంతో పాటు దెబ్బతిన్న రోడ్లు, గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని, అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జోనల్ డీసీ సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం కమిషనర్ సుదర్శన్, టీపీవోలు, టీపీఎస్లు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.