15 August, 2026 | 1:04 AM

80వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా..

15-08-2026 12:11 AM

80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు

నేరేడుచర్ల, ఆగస్టు14 : నేరేడుచర్లలోని పినాకిల్ పాఠశాల విద్యార్థులు 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వై విధ్యంగా శుభాకాంక్షలు తెలియజేశారు.170 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని కొంతమంది విద్యార్థులు పట్టుకొని నిలబడగా,మరికొంతమంది విద్యార్థులు 80 (సంఖ్య) ఆకారంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పినాకిల్ విద్యా సంస్థల చైర్మన్ మదార్ సార్ మాట్లాడుతూ,దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.

విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండి, దేశ పురోగతికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. 170 అడుగుల జాతీయ జెండాతో 80 ఆకారంలో కూర్చుని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.