13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి

28-03-2026 12:00 AM

గంగాధర, మార్చి 27 (విజయక్రాంతి): గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల,  కురిక్యాల, మధురానగర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ఉప్పరమల్యాలలో కొండగట్టు దేవాలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పండుగలకు ప్రత్యేక గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు శ్రీరామనవమి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, మండల సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, కురిక్యాల సర్పంచ్ కాడరి హారిక కనుకయ్య, వేముల భాస్కర్, రెండ్ల శ్రీనివాస్, బాసవేణి శ్రీనివాస్, కర్ర బాపు రెడ్డి, మేర్జ కొండయ్య, గుండారపు మధు, కనకట్ల తిరుపతి, కర్ర కార్తిక్ రెడ్డి, మ్యాక వినోద్, గుండారపు సంపత్, అదుర్తి ఎల్లయ్య, రాగుల సుధాకర్, శనిగరపు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.