13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

28-03-2026 12:00 AM

ఒక మహిళకు నాలుగు సంబంధాలు 

నిర్మల్, మార్చి 27 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామ్ గడ్‌లో ఈనెల 24 హత్యకు గురైన గజానన్ కేసును చేదించినట్టు నిర్మల్ ఏ ఎస్ పి సాయికిరణ్ తెలిపారు. శుక్రవారం వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన తిరుమల అనే మహిళ ఒకరికి తెలియకుండా ఒకరితో నాలుగు అక్రమ సంబంధాలను కొనసాగించింది. ఇందులో గజానంద్ గడ్పాల్ శ్రీని వాస్ వెంకటేష్ రాజులు ఉన్నారు.

గజానం ద్ తిరుమల విషయంలో మిగతా ముగ్గురు తో తరచుగా గొడవపడేవారు. తిరుమల అనే మహిళ తనకు మాత్రమే చెందిందని గొడవపడి మిగతా ముగ్గురితో ప్రతిరోజు న్యూస్ చేసేవారు. ఈ విషయాన్ని గమనించిన తిరుమల గజానను హత్య చేయాలని నిర్ణయించుకుంది. దీనికి గడుపాల్ శ్రీనివాస్ వెంకటేష్ రాజు పూర్తి సహకారం అందించారు. ఈనెల 24 ఇంటికి పిలిపించి అతని తో ఫుల్లు గా మద్యం తాగించి తిరుమల శ్రీనివాస్ వెం కటేష్ రాజు నలుగురు గజానన్ అనే వ్యక్తిని శ్యామ్ గాడ్లోకి బలవంతంగా తీసుకెళ్లారు.

అక్కడి కర్రలు బీరు సీసాలు తో దాడి చేసి హత్య చేసి పారిపోయినట్టు తెలిపారు. కు టుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఇం దులో ఏఘూధ్‌౧ తిరుమల ఏఘూ౨ శ్రీనివాస్‌లను అరెస్టు చేయగా మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని ఏఎస్పీ  తెలిపారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు.