22 March, 2026 | 6:59 PM

ప్రసూతి ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

21-07-2024 01:45 PM

వనపర్తి ( విజయక్రాంతి ) : ఆసుపత్రికి వచ్చే బాలింతలకు చిన్నారులకు, గర్భవతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే మేఘా రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని ప్రసూతి ( ఎం సి హెచ్ ) ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేసారు. ఆసుపత్రి లో అందించే వైద్య సేవల గురించి వివరాలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య వనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్,  ప్రాముఖ వైద్యులు పగిడాల శ్రీనివాస్ పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.