01-08-2025 11:01:07 PM
మునగాల (విజయక్రాంతి): మునగాల గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటరీ నందు శుక్రవారం కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy) గేట్ల స్విచ్ ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత రెండు నెలలుగా ఎగువన రాష్ట్రాలలో వర్షాలు సకాలంలో కురవడంతో నాగార్జునసాగర్ కు పెద్ద ఎత్తున వరద జలాలు రావడంతో రైతులకు సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీళ్ళ అందించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టారని, ఆయన చొరవతో నేడు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్కు సాగునీలు విడుదల చేసుకోవడం సంతోషకరమని కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలోని రైతులు సాగర్ నీళ్లతో రెండు పంటలు పండించి వ్యవసాయం పండగలా మారి లాభాలు అర్ధించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు, బార్ సోషల్ అధ్యక్షులు చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరపమ్మ సుధీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, ఉప్పుల జానకి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.