02-08-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కాగజ్ నగర్, ఆగస్టు 1(విజయ క్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని గన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ఆకస్మికంగా సం దర్శించారు.
తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించి పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యాభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని, నాణ్యమైన విద్య బోధన చేయాలని తెలిపారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల వివరాలు, గైర్హాజరు వివరాలు, వారు పాఠశా లకు రాకపోవడానికి గల కారణాలను తెలుసుకొని విద్యార్థుల హాజరు, విద్య అబ్యాస నపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం అయినందున పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, 10వ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలపై ఇప్పటినుండే సన్నద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.