8 June, 2026 | 5:39 PM

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..

08-06-2026 04:36 PM

ఆదిలాబాద్: ఉట్నూర్ మండలం మ్యాదరివాడ లో సీసీ రోడ్స్ మరియు డ్రైనేజీల నిర్మాణానికి  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరతిగతిన నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అబివృద్ధికి కృషి చేస్తున్నాం అన్నారు. గ్రామాల్లో అబివృద్ధి అదికార పార్టీతోనే సాధ్యం ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు అని సూచించారు.