అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి, మార్చి 26 (విజయక్రాంతి): ఈరోజు తెలంగాణ వైద్య విధాన పరిషత్ 2026 బిల్లు ప్రవేశపెట్టినందుకు మన హెల్త్ మినిస్టర్ కి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. ఈ మార్పుల వల్ల అధ్యక్ష, మరి డాక్టర్స్ గానీ, స్టాఫ్ గానీ, రెండు వైద్య విధాన పరిషత్ అలాగే డైరెక్టరేట్ ఇద్దరూ కలిసి సమన్వయంతో ఇంక ఎక్కువ పేషెంట్ కేర్ తీసుకోవడం, ఇంప్రూవ్ చేయడం జరుగుతది అందుకు కృతజ్ఞతలు. కాకపోతే మా నియోజకవర్గంలో మూడు వైద్య విధాన పరిషత్ సి.హెచ్.సి లు ఉన్నాయి అధ్యక్ష.
అందులో మూడు కూడా కొత్త బిల్డింగ్స్ వచ్చేసి 100 బెడెడ్ హాస్పిటల్ ఒకటి, 30 బెడెడ్ ఒకటి, 50 బెడెడ్ ఒకటి ఓపెనింగ్ కి రెడీగా ఉన్నాయి. కాకపోతే కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్ లేరు అధ్యక్ష. దానివల్ల మేము ఓపెన్ చేయడానికి కూడా కొంచెం భయపడాల్సిన పరిస్థితి ఉంది. కల్లూరు సి.హెచ్.సి లో అయితే అసలు క్యాడర్ స్ట్రెంత్ అనేదే లేదు అధ్యక్ష. ఇప్పుడున్న డాక్టర్స్ కూడా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ లేదంటే వేరే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకున్నాము.
కనుక దయచేసి అతి త్వరలో గనుక మా మంత్రి గారు మాకు క్యాడర్ స్ట్రెంత్ ఇచ్చి గనుక చేస్తే, అలాగే మా 100 బెడెడ్ హాస్పిటల్ కి సీటీ, ఎంఆర్‌ఐ కూడా ఇస్తే గనుక మాకు పేషెంట్ కి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వడం కుదురుతుంది అధ్యక్ష. అలాగే ఉన్న కొంతమంది డాక్టర్స్ కూడా.. వాళ్ళు ఒక్క నిమిషం.. వాళ్ళు కూడా డెప్యుటేషన్ మీద మాది ఇంటీరియర్ ఏరియా, రూరల్, ట్రైబల్ ఏరియా కలిసి ఉంటుంది. కనుక డెప్యుటేషన్ మీద వాళ్ళు ఖమ్మం సరౌండింగ్స్ లో ఉండటానికి ఇష్టపడి డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతున్నారు. కనుక దయచేసి కొంచెం ఏమన్నా వాళ్ళకి కొద్దిగా ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చి, మామూలుగా ప్లేన్ ఏరియా కంటే కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తే గనుక వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది గనుక గౌరవనీయులైన మంత్రి కి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. థాంక్యూ.‘




