13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఇందిరాపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదు

27-03-2026 12:00 AM

పైడి రాకేష్‌రెడ్డిపై మండిపడ్డ మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష 

ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఇందిరాగాంధీ గురించి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అవమాన కారంగా మాట్లాడడం చాలా బాధకరని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మహిళ నాయకురాళ్లతో కలిసి మాట్లాడారు.

ఇందిరా గాంధీ గురించి అనాడు బీజేపీ జాతీయ నేత వాజ్ పే య్ ఆమెను అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దుర్గామాతతో పొల్చారని గుర్తు చేశారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం ఇందిరమ్మ ను అవమానిస్తు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపన చేప్పాలని డిమాండ్ చేశారు.

టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ... మహిళలను అగౌరవ పరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే వెంటనే క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ అన్నపూర్ణ, నాయకులు సంజీవ్ రెడ్డి, బండారి సతీష్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.