యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షున్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులో చికిత్స పొందుతున్న తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్ ను ఆసుపత్రికి వెళ్లి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) పరామర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అక్రమ మట్టి దందాను ప్రశ్నిస్తున్న యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్ పై అడ్డగూడూరు మండల కేంద్రంలో ఈనెల 21 శనివారం రాత్రి దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ కప్పల రాజేష్ ను వనస్థలిపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి కప్పల రాజేష్ ను పరామర్శించారు. రాజేష్ తో పాటు నియోజకవర్గ నాయకులు దాడి జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.






