10 March, 2026 | 7:53 AM

కామారెడ్డిలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే వినతి

10-03-2026 01:35 AM

కామారెడ్డి, మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో క్రీడల అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ స్పోరట్స్ స్కూల్ ,స్పోరట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సోమవారం కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు.  కామారెడ్డి పట్టణానికి ఆనుకొని ఉన్న సుమారు 300 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఉత్తరాది పంజాబ్ లో స్పోరట్స్ విలేజ్ ఉందని తెలిపారు. 

దక్షణాది రాష్ట్రాలకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో  ఏర్పాటుకు మంజూరు చేయాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కు వినతి పత్రాన్ని సమర్పించారు.  దేశ రాజధాని డిల్లీ లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి  కలిసి వినతి పత్రం సమర్పించి నట్లు తెలిపారు.

యువత లో ప్రతిభను పెంపొందించడానికి  జిల్లా , రాష్ట్ర స్థాయిలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి కామారెడ్డి జిల్లాలో సమగ్ర క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసిన తక్షణ అవసరాన్ని మంత్రి  దృష్టికి తీసుకెళ్ళనని పేర్కొన్నారు,  ఈ విషయంలో, స్పోరట్స్ స్కూల్ / స్పోరట్స్ విలేజ్ ఏర్పాటు కోసం కామారెడ్డి పట్టణానికి ఆనుకొని ఉన్న సుమారు 300 ఎకరాల తగిన ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలని వారి దృష్టికి తీసుకురావడం జరిగిందఅన్నారు.

ప్రతిపాదిత స్పోరట్స్ స్కూల్  సౌకర్యం వల్ల క్రీడా అభివృద్ధికి ప్రత్యేక కేంద్రంగా, నివాస శిక్షణ, కోచింగ్, హాస్టళ్లు, ఆట స్థలాలు, ఇండోర్ స్టేడియంలు, బహుళ క్రీడా విభాగాలకు అనుబంధ మౌలిక సదుపాయాలను అందిస్తుందనీ, దీని ద్వారా గ్రామీణ, పట్టణ యువత క్రీడలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తుందనీ తెలిపారు.

కామారెడ్డి జిల్లా నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, పెంపొందించడం, శాస్త్రీయ శిక్షణ, ఆధునిక శిక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం కోసం అవకాశాలను సృష్టించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందనీ అన్నారు, తెలంగాణ క్రీడా పర్యావరణ వ్యవస్థలో కామారెడ్డి జిల్లా పాత్రను పెంచుతుందనీ అన్నారు.

కామారెడ్డి పట్టణానికి  భూమి దగ్గరగా ఉన్నందున మెరుగైన కనెక్టివిటీ, విద్యా, నివాస సౌకర్యాలతో భూమిని గుర్తించిన తర్వాత, సంబంధిత క్రీడా అభివృద్ధి పథకాల కింద ఆమోదం తెలిపి నిధుల కోసం అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు.  అందువల్ల సాధ్యాసాధ్యాల అంచనా కోసం వీలైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని, తదుపరి చర్య కోసం ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించాలని కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి ని కలిసి విన్నవించినట్టు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు.