01-08-2025 01:12:19 AM
ఇందిరమ్మ ఇండ్ల మంజూరీకి భరోసా
తుంగతుర్తి, జులై 31 : జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గాధంగి రేణుక, అనూష, ఉమా, మామిడి శీను కుటుం బాలకు చెందినవారు ఇండ్లు సక్రమంగా లేక ఇబ్బందులు పడు తున్నందున ’ఎమ్మెల్యే సార్.. కలెక్టర్ సార్.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి’ అనే శీర్షికన రాసిన విజయక్రాంతి కథనానికి వెంటనే తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నిరు పేదకి అండగా ఉండి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ధ్యేయంతో నిరంతరం పనిచేస్తున్నదనీ, దానిలో భాగంగానే పేద కుటుంబాలకు హామీ ఇస్తున్నట్టు తెలిపారు.వెంటనే అధికారులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడి వారి కుటుంబాలకు తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.
దీంతో తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న బృందం వారి గృహములను సందర్శించి వారి పూర్తి వివరాలు తీసుకొని ఎమ్మెల్యే సూచన మేరకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు కొండరాజు, వీరబోయిన గంగరాజు, వీరబోయిన రాములు, మంగళపల్లి నాగరాజు, అక్కినపల్లి రాములు, ఉప్పుల శ్రీను, బత్తుల జలంధర్, కొండా పరశురాం, చంటి తదితరులు పాల్గొన్నారు.