calender_icon.png 2 August, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్‌వైజర్లు పనితీరు మార్చుకోవాలి

01-08-2025 01:11:44 AM

- ఆశ, ఆరోగ్య కార్యకర్తలను సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ చేపట్టాలి 

- ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలి

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.హరీశ్‌రాజ్ ఆకస్మిక తనిఖీ

లక్షేట్టిపేట, జూలై 31: మండలంలోని వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ మందుల నిలువలను ఫార్మసిని, ల్యాబ్, ఓపి రూములను, వార్డులను గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ... ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్లు సరైన రీతిలో పనిచేయడం లేదని అధికంగా ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వారంతా తమ పని తీరును మెరుగుపరుచుకోవాలని, లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశానుసారము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ఉపకేంద్రములలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండాలని అదేవిధంగా జిల్లాలోని సూపర్‌వైజర్లు  అందరూ తమ పరిధిలోని గర్భవతులకు సంబంధించిన ఈటీడీ వివరములను దగ్గర ఉంచుకోవాలని వైద్యాధికారి రూములో టేబుల్ పైన ఉంచాలని ఆదేశించారు.

అదేవిధంగా ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది వివరములను రాపిడ్ ఫీవర్ సర్వే ప్రోగ్రాం యొక్క యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసుకోవాలన్నారు. ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరములు పెట్టడానికి యాక్షన్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. సూపర్‌వైజర్లు తమ పరిధిలోని ఆరోగ్య ఆశా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ రోజువారీగా వివరములను సేకరించాలన్నారు. లేనియెడల చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.

రెండు రోజుల లోపల అన్ని వివర ములతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచాలని సూపర్‌వైజర్లను హెచ్చరించారు. సూపర్‌వైజర్లు తమ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రములు సందర్శించి గ్రామాలలో ఆశ ఆరోగ్య కార్యకర్తలు తిరుగుతున్న వివరములను తెలియజేయాలని అవగాహన కార్యక్ర మాలు చేపట్టాలని గ్రామ పంచాయతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో సమన్వ యం చేసుకోవాలని ఆదేశించారు.ఉపకేంద్రములలో కూడా సమయపాలన పాటిస్తూ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 

తెలంగాణ డయాగ్నొస్టిక్స్ కు రోజు వారిగా రక్త నమూనాలు పంపించాలని, సూపర్‌వైజర్లుకు ఎఫ్టిఏ కార్యక్రమాన్ని తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు 9:00 గంటలకు ఉపకేంద్ర సిబ్బందితో గూగుల్ మీట్ తీసుకోవాలని దీని ద్వారా ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాల లో జరుగుతున్న వైద్య సేవలు తెలుసుకొన డం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైద్యాధికారి డాక్టర్ సతీష్, శోభా రాణి, సూపర్‌వైజర్ల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్పు చేసుకోవాలని పనిపై దృష్టి పెట్టాలని అన్ని వివరములను వైద్యాధికారికి తెలియజేయాలని వైద్యాధికారి చెప్పిన విధంగా వివరములను అందించాలని ఆదేశించారు.

సుమలత స్టాఫ్ నర్స్‌కు రోజువారిగా తెలంగాణ డయాగ్నొస్టిక్ పం పించే వివరములను అందజేయాలని ఐరి స్క్ గర్భవతుల వివరాలు దగ్గర ఉంచుకొని వివరములు సేకరించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి శుభ్రం లేనందున గ్రామపంచాయతీ వారి సహకారంతో శుభ్రం చేయించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, ఆశ్రమ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలను సంద ర్శించి అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబి రం లను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించిన పోస్టర్లు గానీ పాంప్లెంట్లు గానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉంచుకోరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి, వైద్యాధికారి డాక్టర్ సతీ ష్, తదితరులు పాల్గొన్నారు.