31-07-2025 12:00:00 AM
పెద్దఎకర్ల, దన్నూరు, సోమూరు వాసుల నరక యాతన
మరమ్మతు చేయాలని విజ్ఞప్తి
మద్నూర్, జులై ౩౦, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లోని 161 వ జాతీయ రహదారి నుంచి పెద్ద ఎక్లార గ్రామం మీదుగా దన్నూర్, సోమూర్ చౌరస్తా వరకు ఉన్న బీటీరోడ్డు గుంతలు పడి అద్వానంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే మూడు గ్రామాల ప్రజలకు నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామాల ప్రజలే కాకుండా విద్యార్థు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత ప్రభుత్వ హయాం లో ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.నాణ్యత లోపించడంతో గుంతలు ఏర్పడి వాహనదారులు, విద్యార్థులు, ౩ గ్రామాల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రోడ్డుకు ఇంతకుముందు కొన్ని నిధులు రావడంతో తాత్కాలికంగా పనులు చేశారని స్థానికులు వాపోతున్నారు. నాణ్యత లేకుండా బీటీ రోడ్డు నిర్మించడంతో గుంతలు పడి దర్శనమిస్తున్నాయన్నారు.
ఇప్పుడైనా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పైన ఆశలు పెట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపడితే గ్రామాల ప్రజలకు, విద్యార్థుల కు ఇబ్బందులు తోలుగుతాయని అంటున్నారు. ప్రతిరోజు ఈ గ్రామం పైనుంచి విద్యాబాసం కోసం పక్క మండలానికి వెళ్తున్న విద్యార్థుల కు అసౌకర్యాన్ని లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వ్యాపార పరంగా కొంతమంది ఇదే రోడ్డు మార్గాన ప్రయాణిస్తుంటారు వాళ్లకు కూడా రాత్రి టైంలో ఇబ్బందులు అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఈ రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన వారికి తమ మద్దతు ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గతంలో ఎన్నో మార్లు అధికారుల కు, ప్రజాప్రతి నిధులకు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి గతంలో నిధులు మంజూరైన పనులు చేపట్టలేదని ఆయా గ్రామాల వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సార్ స్పందించి ఈ రోడ్డును బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.