26-09-2025 05:51:27 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ సుందరీకరణకు, అభివృద్ధి నిధులు మంజూరు చేసినందుకు ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం ఖానాపూర్ పట్టణ కేంద్రం తెలంగాణ చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా నిధులు 15 కోట్లు ఖానాపూర్ మున్సిపాలిటీకి మంజూరు చేశారు. దీంట్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు, పట్టణంలో ఉన్న రెండు కుంటలు, అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారి ,రింగు రోడ్లు ,అభివృద్ధి చేసే అవకాశం కలిగిందని ఆయన అన్నారు.
ఇందుకోసం ఎమ్మెల్యే, ఇన్చార్జి మంత్రి ,ముఖ్యమంత్రులకు ఖానాపూర్ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్ ,ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజుర సత్యం, అంకం రాజేందర్ ,షబ్బీర్ పాష, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ పాషా, అమనుల్లా ఖాన్ ,మధిరే సత్యనారాయణ ,,జన్నారపు శంకర్, జంగిలి శంకర్, నయీమ్, మడిగల గంగాధర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.