20 June, 2026 | 2:39 AM

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రీ బిడ్ సమావేశం

20-06-2026 12:00 AM
  1. బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్ హోటల్‌లో నిర్వహణ
  2. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భావి బిడ్డర్లు

హైదరాబాద్, జూన్ 19(విజయక్రాంతి): మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, హకీంపేట్లో ఉన్న భూ పార్సెల్ ఈ-వేలం ప్రతిపాదనకు సంబంధిం చి శుక్రవారం బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్ హోటల్‌లో ప్రీ- సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 50 మందికి పైగా భావి బిడ్డర్లు హాజరై విశేష స్పందన వ్య క్తం చేశారు. సమావేశంలో మెస్సర్స్ జేఎల్‌ఎల్ సంస్థకు చెందిన సందీప్ పవర్‌పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, హైదరాబాద్ నగర వేగవంతమైన అభివృద్ధి, స్థలం వ్యూహాత్మక ప్రాధాన్యత, దాని ప్రత్యేక ప్రయోజనాలు, ఆ ప్రాంతంలోని విస్తృత అభివృద్ధి అవకాశాలపై సమ గ్ర వివరాలు అందించారు.

ఎంఎస్‌టీసీ సం స్థ మేనేజర్ జమీల్ అక్తర్ ఈ-వేలం ప్రక్రియ పై సవివర ప్రజెంటేషన్ నిర్వహించి, పాల్గొ న్న వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చా రు.  హెచ్‌ఎండీఏ ప్రధాన ఇంజనీర్ బి. ర వీందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రజిత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ. రవీందర్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ బి. ప్ర సాద్ రావు, సికిందరాబాద్ డివిజన్ ఆర్డీవో సాయిరామ్, హెచ్‌ఎండీఏ డిప్యూటీ కలెక్టర్  వై. సుదర్శన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  రామారావు తదితరులతో పాటు హెచ్ ఎండీఏ ఎస్టేట్స్, ప్రజాసంబంధాలు, ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన వేలం వి ధానాన్ని ఈ ప్రాజెక్టుతో అనుసంధానమైన అ భివృద్ధి అవకాశాలను పాల్గొన్న వారు అభినందించారు. సమావేశం సానుకూల వాతా వరణంలో విజయవంతంగా ముగిసింది.