20 June, 2026 | 3:39 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

త్రిలింగ రామేశ్వర ఆలయం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

07-02-2026 12:05 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ త్రిలింగ రామేశ్వర ఆలయం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రావు మాట్లాడుతూ.. రానున్న శివరాత్రి పండగ సందర్భంగా త్రిలింగేశ్వర ఆలయం వద్ద మూడు రోజులపాటు  చేపట్టబోయే జాతర గురించి ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.శివరాత్రి పండుగ సందర్భంగా త్రిలింగ రామేశ్వర ఆలయం వద్ద మూడు రోజులపాటు జరగనున్న జాతరకు అన్ని ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.జాతరను పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలిపారు.

ఎలాంటి సదుపాయాలు ఇబ్బందులు ఎదురైన ముందస్తు సమాచారం ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదా గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు,ఉప సర్పంచ్ ముత్యాల అభిషేక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవులు, వేముల సంగయ్య, విట్టల్ రెడ్డి, బాల్రెడ్డి, ఫారుక్, వరిగే విట్టల్, ఠాగూర్, నరసింహ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మురళి గౌడ్, సత్యనారాయణ, నారాయణరెడ్డి, శ్రీరామ్ గౌడ్, సురేందర్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.