03-10-2025 07:57:27 PM
- జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు
- జమ్మి పంచుతూ, ఆలింగణం చేసుకున్న ప్రజలు
- పాలపిట్టల పిట్టను దర్శించుకున్న ప్రజలు
- వేడుకల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రముఖులు
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా దసరా సంబరాలు గ్రామ గ్రామాన అంబరాన్నంటాయి. షమీ పూజలు, రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కోరికలను జమ్మి చెట్టుకు సమర్పించుకున్నారు. జమ్మి పంచుతూ, ఆలింగణం ఒకరికొకరు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాలపిట్టను దర్శించుకున్నారు, దుర్గమాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త బట్టలు ధరించి బాణాసంచాలు పేల్చి కుటుంబ సమేతంగా విజయదశమిని గడిపారు. ఆయుధ పూజలు నిర్వహించారు. నకిరేకల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ ఆలయాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా సందర్శించి పటేల్ నగర్ లో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.