19 May, 2026 | 6:40 AM

నవ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

19-05-2026 12:00 AM

చిట్యాల, మే 18 : నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య ఆదివారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ్య మృతి ఎంతో బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అండగా ఉంటామని పేర్కొన్నారు.