calender_icon.png 18 November, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కేసులతో వేధించడం సరికాదు

18-11-2025 12:00:00 AM

అక్రమ కేసులపై యువతకు అండగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే

బిచ్కుంద, నవంబర్ 17 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీపరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు నిర్వహించిన బిచ్కుంద బంద్ మరియు ధర్నా కార్యక్రమాలకు సంబంధించి యువతపై పెట్టిన అక్రమ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ప్రజా సమస్యను ప్రశ్నించినందుకు యువతను బెదిరించడం ప్రజాస్వామ్యానికి పనికిరాని విధానం అని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం యువతకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బాధిత యువకులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం గొంతు వినిపించడం తప్పేదేమీ చేయలేదని, ఇలాంటి అక్రమ కేసులు ఎవరినీ భయపెట్టలేవని స్పష్టం చేశారు. కేసులు నమోదైన బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..

యువకులు భయపడాల్సిన అవసరం లేదని, జుక్కల్ నియోజకవర్గ యువత, ప్రజల పైన అక్రమ కేసులు పెట్టిన మా ప్రభుత్వం రాగానే అవి అన్ని ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.మీ వెంటే నేనున్నానని, ప్రజా హక్కుల కోసం పోరాడిన ప్రతి ఒక్కరి కోసం అండగా నిలబడతాను అని భరోసా కల్పించారు. సెంట్రల్ లైటింగ్ లాంటి ప్రాథమిక సౌకర్యం కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.