calender_icon.png 29 May, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల పక్షాన కొట్లాడుతా!

28-05-2025 01:31:00 AM

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పల్లా

చేర్యాల మే 27:  పేదలకు సంక్షేమ ఫలాలు అందే వరకు తాను వారి పక్షాన కొట్లాడుతానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా మద్దూరు చేర్యాల మండలాలలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల లాంటివని, కానీ ప్రస్తుత  ప్రభుత్వం వాటిని విస్మరించిందని తెలిపారు.

మద్దూరు మండలంలో సరైన రోడ్లు, మౌలిక వసతులు లేవని సంబంధిత మంత్రి అయినా సీతక్కను రిక్వెస్ట్ చేశానని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పార్టీలు చూడకుండా మంజూరు చేశారో, ఇప్పుడు అదే విధంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహిళలకు 2500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, వృద్ధాప్య పింఛన్ పెంపు తదితర పథకాల అమలులో ప్రభుత్వం విఫలం అయింది అన్నారు. ఆఖరికి ధాన్యం సేకరణలో కూడా ప్రభుత్వ చేతకానితనం బయటపడింది అన్నారు. తపస్ పల్లి రిజర్వాయర్  నిర్మించినప్పటి నుండి ఎన్నడూ ఎండిపోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎండిపోయిందని ఆయన విమర్శించారు.

సాగునీటి పంపిణీ పై ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపరించిందని పేర్కొన్నారు. రైతు భరోసా లాంటి పథకాలకు పైసల్ లేవంటున్న ప్రభుత్వం అందాల పోటీలకు పైసలు ఎక్కడివి అని ఎద్దేవా చేశారు.

రైతుల పట్ల ప్రభుత్వంకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అనంతరం ఆయా మండలాలకు సంబంధికిందకళ్యాణ లక్ష్మి పథకం కింద 21 మందికి,69 బాధితులకు  సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు అంకుగారి రెడ్డి, సుంకర మల్లేశం, మేక సంతోష్, మాజీ ఎంపీపీ కర్ణాకర్, ముత్యం నరసింహులు, గీస బిక్షపతి, సిల్వేర్ సిద్ధప్ప, ఎరుపుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.