కాంగ్రెస్ ఆశ చూపి మోసం చేసింది
- సిద్దిపేట అన్ని రంగాల్లో అగ్రగామి
- ఆయిల్‌పామ్ సాగు విస్తరణ పెంచాలి
- మచ్చవాని కుంట సుందరీకరణకు కృషి
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, జూన్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు ఆశ చూపి మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలం శంకరయ్యకుంట గ్రామంలో వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. సిద్దిపేట రూరల్ మండలం కొల్లూరు గ్రామంలో వేసెట్టి రాజు తల్లిదండ్రుల స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు.
సిద్దిపేట పట్టణంలోని మత్సవానికి సందర్శించి అభివృద్ధి కోసం అవసరమైన నివేదికల రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులను ప్రోత్సహించాలని ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్రకు సరుకులు పంపిణీ చేసే వాహనాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. సిద్దిపేట అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచిందన్నారు.
కాలేశ్వరం నీళ్లు రైతు బంధు బీడీ పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వడ్లు కొనక, ఎరువులు ఇవ్వక రైతులను ప్రభుత్వం ఇబ్బందుల గురిచేస్తున్నదని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌తో సంబంధం లేకుండా ఆయిల్ ఫాం సాగు చేసిన రైతులకు యూరియా అందించాలని కోరారు. పంట దెబ్బతినకుండా సమయానికి అనుకూలంగా ఎరువులు అందించాలని సూచించారు.






