12 August, 2026 | 2:52 AM

60 గజాల ఇళ్ల స్థలాల బాధితులకు ఎమ్మెల్యే యాదయ్య పరామర్శ

12-08-2026 12:00 AM

సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ

మొయినాబాద్, ఆగస్టు 11(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న లబ్ధిదారులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం పరామర్శించారు. దీక్ష చేస్తున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారుల సమస్యను జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

అర్హత కలిగిన పట్టాలు పొందిన లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరయ్యేలా ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు లబ్ధిదారులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.కార్యక్రమంలో తహసీల్దార్ గౌతమ్కుమార్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.