12 August, 2026 | 2:49 AM

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

12-08-2026 12:00 AM

మాధవరం కాంతారావు

కూకట్ పల్లి, ఆగస్టు 11,( విజయ క్రాంతి): స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూకట్పల్లి బిజెపి ఇంచార్జ్ మాధవరం కాంతారావు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాధవరం కాంతారావు మంగళవారం తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భారతీయుల్లో దేశభక్తి పెంపొందించడంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ నివాసాలపై జాతీయ జెండా ను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో హర్ ఘర్ తిరంగా కో కన్వీనర్ రమేష్, భాజపా నాయకులు శ్రీహరి, గణేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.