calender_icon.png 27 July, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ జన్మదినం.. వైద్యసిబ్బంది అత్యుత్సాహం

13-12-2024 02:28:21 AM

* పల్లె దవాఖానకు తాళం వేసి మరీ వేడుకకు హాజరు

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ప్రజలకు వైద్యసేవలందించాల్సిన సమయంలో హెల్త్ సిబ్బంది ఓ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దవాఖానకు తాళం వేసి మరీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివెళ్లారు. ఈ ఘటన గురువారం తాడూర్ మండలం ఇంద్రకల్‌లో వెలుగు చూసింది. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసం లో వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ఇంద్రకల్‌లోని పల్లె దవాఖాన హెల్త్ అసిస్టెంట్‌తో పాటు కొందరు దవాఖానకు తాళం వేసి మరీ హాజరయ్యారు. 

ఎమ్మెల్సీపై వ్యక్తిగత అభిమా నం ఉంటే ఉండొచ్చు గానీ.. పేదలకు వైద్య సేవలందించే సమయంలో.. దవాఖాన మూసి మరీ వేడుకలకు హాజరు కావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.