calender_icon.png 27 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్

13-12-2024 02:24:40 AM

* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఖమ్మంలో గంజాయి రవాణా, అమ్మకాల ను కట్టడి చేయాలని, అవసరమైతే విక్రేతలపై పీడీయాక్ట్ నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నగరంలో గురువారం ఆయ న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగర మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యతో కలిసి మున్సిపల్  కార్పొరేషన్ కార్యక లాపాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. నగరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి, మాదక ద్ర వ్యాల సరఫరా రావడానికి వీలు లేదన్నారు. యువత భవిష్యత్ దృష్ట్యా డ్రగ్స్ అంశాన్ని తీసుకోవాలని సూచించారు. 

అభివృద్ధి పనులపై..

రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్రాజెక్టు రిపోర్టు తయారు  చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించా రు. వర్షాకాలం కంటే ముందు రాజమండ్రి రహదారి పూర్తి కావాలన్నారు. నగరంలో స్లాటర్ హౌస్‌కు అనువైన స్థలం ఎంపిక చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. ప్రతి డివిజన్‌లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిని పరి శీలించి రోజు రిపోర్టు అందించేలా అబ్జర్వర్ల ను నియమించుకోవాలని మంత్రి కమిషనర్‌ను ఆదేశించారు.  సమావేశాల్లో డీఎఫ్‌వో సిద్దార్థ్ విక్రమ్‌సింగ్,  అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.