calender_icon.png 6 November, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులపై దౌర్జన్యం చేసిన ఇద్దరు వ్యక్తుల రిమాండ్

05-11-2025 11:19:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మండలంలోని పెద్దబూద గ్రామంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శివకృష్ణ, కానిస్టేబుల్ శివశంకర్ లు విధులలో ఉండి స్థానికంగా జరుగుతున్న గొడవను ఆపే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులపై దౌర్జన్యం చేసి పారిపోయిన చింతకుంట్ల గణేష్, చింతకుంట్ల మహేష్ అనే వ్యక్తులను బుధవారం గ్రామంలో పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించిన, పోలీసులపై ఎవరైనా దాడులకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.