1 May, 2026 | 1:51 PM

30న తెలంగాణకు మోదీ

28-04-2024 01:07 AM

l మే 1న హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు బీజేపీ కీలక నేతలు క్యూ కడుతున్నారు. ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండలం సిల్వార్ గ్రామం వద్ద జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఆ తర్వాతి రోజు మే 1న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున ప్రచారం నిర్వహించేందుకు నగరానికి వస్తున్నారు. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు జరిగే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 29న ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కొత్తగూడెంలో ఉదయం 11 గంటలకు, మహబూబాబాద్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. అదేరోజు సాయంత్రం మల్కాజిగరి నియోజకవర్గం పరిధిలోని నిజాంపేటలో సాయంత్రం 6 గంటలకు జరిగే రోడ్‌షోలోనూ నడ్డా పాల్గొంటారు. ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఎన్నికల ప్రచారంలో 

పాల్గొంటారు.