calender_icon.png 6 May, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ పర్యటనకు మోదీ

20-04-2025 12:44:11 AM

ఏప్రిల్ 22, 23 తేదీల్లో పర్యటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. సౌదీ దేశ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేర కు ఈ నెల 22, 23 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికా రికంగా ధ్రువీకరించింది.

జెడ్డా నగరంలో మోదీకి సౌదీ రాజు స్వాగతం పలకనున్నా రు. ఈ ఇద్దరు నేతలు ‘స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్’ రెండో సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ అధికారులు ఆశా భావం వ్యక్తం చేశారు.