calender_icon.png 28 May, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలరాముడికి మోదీ పూజలు

06-05-2024 02:01:51 AM

అయోధ్య, మే 5: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఇటీవలే ప్రతిష్ఠించిన బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం మూడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ దశలో 10 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచా రాన్ని ముమ్మరం చేసిన మోదీ.. ఇటావాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొ న్నారు. అంతకుముందు అయోధ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న హిందువుల 500 ఏండ్ల కలను తాము సాకారం చేశామని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు వ్యతిరేకించాయని ఆరోపించారు.