28-05-2025 09:47:46 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్(Warangal district) జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(Young India Integrated School) లను మంజూరు చేసింది. మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన చేసే విధంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి(Assembly Constituency) ఒక స్కూలును మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో గత ఏడాది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేసింది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేస్తూ ఒక్కో స్కూలుకు 200 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు నిధులను కూడా మంజూరు చేసింది.