29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

‘మహ్మద్ అబ్దుల్ లతీఫ్’కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష

30-10-2025 12:00 AM

నిజామాబాద్ లీగల్, కరెస్పాండెంట్ అక్టోబర్ 29 (విజయ క్రాంతి): ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి, హిందువుగా మారతానని నమ్మించి అత్యాచారం చేసిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష, మోసం చేసినందున మరో సంవత్సరం సాదారణ జైలుశిక్ష విదిస్తూ మహిళలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష బుధవారం తీర్పు చెప్పారు.

కోర్టు వెలవరించిన నలభై మూడు పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ నగర పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పదమూడు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని,పన్నెండు ధ్రువీకరించుకున్న పత్రాలు, రెండు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసిన అనంతరం ప్రాసిక్యూషన్, ముద్దాయి తరపున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం, అన్నింటిని అధ్యయనం చేసిన పిదప నేరారోపితుడు అయిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ పై మహిళను మోసం చేసి, పదే పదే ఆమెపై అత్యాచారం చేసిన నేరారోపణలు రుజువు అయినట్లు నిర్దారించింది.

ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి హిందువుగా మారి పెళ్లి చేసుకుంటానని ఆమెను లొంగదీసుకుని ఆమె ఇంటిలో, అతని ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు.

మాయమాటలు చెప్పి మోసం చేశాడు.భారత శిక్షస్కృతి సెక్షన్ 417(మోసం చేయడం ) ప్రకారం ఒక సంవత్సరం సాదారణ జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష, సెక్షన్ 376(2)(n) పదే పదే అత్యాచారం చేసిన నేరానికిగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల సాదారణ జైలుశిక్ష అనుభవించాలని అదనపు సెషన్స్ హరీష తమ తీర్పులో పేర్కొన్నారు.పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. బాధిత మహిళకు ఐదు లక్షల రూపాయల పరిహారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చెల్లించాలని జడ్జి హరీష తమ తీర్పులో సిపార్సు చేశారు.