calender_icon.png 31 October, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలపై బీజేపీ నేతల హర్షం

30-10-2025 12:00:00 AM

- రాజకీయాలు ఎన్నికల వరకే... అభివృద్ధి చేయడమే మాపార్టీ సిద్ధాంతం

- సీఎస్‌ఆర్ నిధులతో కోటి రూపాయల పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రికి అందజేత

- కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపిన నేతలు

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలపై బిజెపి నేత లు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజ య్ సహకారంతో కోటి రూపాయల సిఎస్‌ఆర్ నిధులనుంచి ఆసుపత్రికి వివిధ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ చెన్నమనేని వికాస్ రావు వాటిని పరిశీలించి మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని, ప్రజలకు అభివృద్ధి చేయడమే మా బీజేపీ పార్టీ సిద్ధాంతమని వారు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన వివిధ పరికరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దీనికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్  జిల్లా కౌన్సిల్ నెంబర్ జక్కుల తిరుపతి వేములవాడ పట్టణాధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మరియు వేములవాడ రూరల్ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ మరియు కొనరావుపేట మండల అధ్యక్షులు మీరాల్కర్ బాలాజీ వేములవాడ పట్టణ మాజీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.