18 August, 2026 | 1:21 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

చిన్నారులను సమర్థవంతులుగా తయారు చేయండి..

11-05-2026 12:31 AM

- ప్రతి బిడ్డ మొదటి అక్షరం అంగన్వాడీలోని నేర్చుకుంటుండ్రు

 పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

మహమ్మదాబాద్ మే 10 : చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో సమర్థవంతంగా తయారు చేయాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నంచర్ల గేటు దగ్గర మహమ్మదాబాద్, గండీడ్ మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల సంక్షేమం, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సేవలు మరియు పోషకాహార కార్యక్రమాల అమలులో ఈ స్మార్ట్ ఫోన్లు కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

అంగన్వాడి కేంద్రాలను లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని పోషకహారం లోపానికి గురి కాకూడదని సూచించారు. ఎక్కడ ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉన్న అంగన్వాడి కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు సలహాలను తీసుకోవాలని కోరారు. చిన్నారులు మొదటి అక్షరం అంగన్వాడి కేంద్రాల్లో నేర్చుకుంటున్నారని, పోషకాహారం క్రమం తప్పకుండా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.