26-08-2025 08:39:01 AM
ములుగు జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భూక్య జంపన్న
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం ప్రాంతాల్లో కోతుల సమస్య తీవ్రంగా మారి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. పంట పొలాల్లో రైతులు, హాస్టల్ విద్యార్థులు, గ్రామాల వీధుల్లో తిరిగే ప్రజలు, రహదారులపై ద్విచక్ర వాహనదారులు కోతుల వేధింపుల వలన నిత్యం కష్టాలు పడుతున్నారని బిఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన అన్నారు. ఈ కోతల సమస్యపై బిఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్న(BRS District Leader Bhukya Jampanna) మాట్లాడుతూ, కోతులు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి.
రైతులు పొలాల్లో పనిచేయడానికి భయపడుతున్నారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై దాడులు చేసి గాయపరిచే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను ఇక నిర్లక్ష్యం చేయలేం. ప్రభుత్వం వెంటనే వన్యప్రాణి శాఖ, స్థానిక అధికారులను రంగంలోకి దించి కోతుల సమస్యను పరిష్కరించాలి అని ఆయన అన్నారు. జంపన్న మరింతగా హెచ్చరిస్తూ“ప్రజలు శాంతియుతంగా జీవించడానికి ప్రభుత్వం కర్తవ్యబద్ధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజలలో ఆగ్రహం పెరుగుతుంది. కోతుల సమస్యను నియంత్రించకపోతే రైతులు, విద్యార్థులు, సాధారణ ప్రజల జీవన విధానమే సవాలుగా మారుతుందిఅని పేర్కొన్నారు.