calender_icon.png 26 August, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైరాన్ మాయ!

26-08-2025 03:27:20 AM

  1. బాచుపల్లిలో నయా భూబాగోతం
  2. అక్రమాలను సక్రమం చేసుకునేందుకు రంగంలోకి రియల్ బడా కంపెనీలు
  3. అధికారులతో కుమ్మక్కు
  4. సీలింగ్ రికార్డుల తారుమారు
  5. అసలైన పట్టాదారుల భూములు కబ్జా చేసేందుకు ప్రణాళిక
  6. వారసులకు రిజిస్టేషన్ చేసిన అధికారి సస్పెన్షన్‌కు ఒత్తిడి! అంటూ ఆరోపణలు 

కుత్బుల్లాపూర్, ఆగష్టు 25 (విజయక్రాం తి): మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో భూములకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉం ది. విస్తరిస్తున్న మహా నగరానికి సమీపంలో అన్ని సౌకర్యాలతో ఔటర్‌రింగ్ రోడ్డుకు అ నుసందానంగా ఉండడం, పేరుగాంచిన ఇం టర్నేషనల్ స్కూల్స్  ఇంజనీరింగ్ కళాశాలలు ఉండటంతో  రియల్ ఎస్టేట్ కంపెనీలు బాచుపల్లిలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న భూ ములకు మంచి డిమాండ్ ఉంది. దాంతో కొందరు అక్రమార్కులు బాచుపల్లిలో ఉన్న సీలింగ్ భూములపై కన్నేశారు. ఎలాగైనా ఈ భూ ములను కోట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు.

వివాదాస్పదంగా 83 సర్వే నెంబర్‌లోని భూమి

కోడూరు వెంకటరామయ్య అనే వ్యక్తి బాచుపల్లిలో 1966లో కోనుగోలు చేసిన మెత్తం 116 ఎకరాల భూమి ప్రభుత్వం 1975లో   సీసీ నెంబర్ 702 /M/75 ద్వారా సీలింగ్ భూమిగా  డిక్లేర్ చేసింది. అప్పటి నుండి ఈ భూములు తమకు  తిరిగి కేటాయించాలని కోడూరు వెంకట్రామయ్య ఆతని సోదరుల వారసులు అప్పటి నుండి ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టులో  LRA 1/2021, WP 7833/2025, 14125/2025 ద్వారా న్యాయపోరాటం చేస్తున్నారు.

అయితే ఈవేమి పట్టని స్థానికంగా ఉన్న కొంతమంది కుల రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలతో కలిసి ఈ భూములపై కన్నేశారు.చాలా వరకు ఈ భూములను ఇప్పటికే కబ్జా చేశారు. సీలీంగ్ రికార్డులను తారుమారు చేసి తమ పేర్ల పై రికార్డులో ఎంట్రీ ఇస్తున్నారు.ఈ వ్యవహారంలో కీలక పాత్ర , సూత్ర దారులు గా మండల, డివిజన్ స్థాయిలో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు.

బాచుపల్లి సర్వేనెంబర్ 83 లో మెత్తం 17 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో 1966లో  డాక్యుమెంట్ నెంబర్ 157/1966 ద్వారా నిమ్మగడ్డ శ్రీరామనాథం 5 ఎకరాల 10 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 164 /1966 డాక్యుమెంట్ ద్వారా 6 ఎకరాల 35 గుంటల భూమిని వేములపల్లి కృష్ణమూర్తి, 165/1966 డాక్యుమెంట్ ద్వారా 5 ఎకరాలు 25 గుంటల భూమిని  కోడూరు వెంకటరామయ్య పట్టాదారు అయిన నవాబ్ జుల్ఫికర్ అలీ సాబ్ నుండి కొనుగోలు చేశారు.

1966లో రిజిస్ట్రేషన్ ద్వారా అమ్మిన భూములు తిరిగి తమకు 1976లో అమ్మారని చూపుతూ నకిలీ సాదా బైనమా  దస్తావే జులు తయారు చేసుకొని 83 సర్వే నెంబర్ లో ఉన్న 83/A సబ్ డివిజన్ సీలింగ్ భూమిని ఖయ్యూం అనే వ్యక్తి పేరు మీదకి A/3062/89 13 (B) ద్వార బదలాయించారు. కోడూరు వెంకట్రామయ్య వీల్ డీడ్ 37/1978 ప్రకారం రికార్డులో ఉన్న కేల్ కిషోర్‌కుమార్ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. భవిష్యత్తులో లీగల్‌గా ఇబ్బందు లు తల్లేతే అవకాశం ఉందని  ఖయ్యూం ద్వారా ఈ భూమిని ఇతరులకు బదలాయించారు.

లీగల్‌గా లొసుగులు తెలుసుకున్న మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాం డ్యూయర్ డెవలపర్స్ బిల్డర్స్ తమకు అధికార పార్టీతో మంచి పలుకుబడి ఉందని  తాము లీగల్ గా అన్ని సెటిల్ చేసుకుంటామని ఈ సీలీంగ్ భూమిలోకొంత భాగాన్ని డెవలప్మెంట్ కోసం, మిగిలిన దాన్ని నేరుగా కొనుగోలు చేసాయి.సీలింగ్ భూమి హద్దులతో తమకు అనుమతులు రావని  గ్రహించి పక్కనే ఉన్న ఇతర పట్టాదారుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న నిమ్మగడ్డ శ్రీరామనాథం వారసులు తాము గతంలో అమ్మి న 2 ఎకరాల 11 గుంటల భూమి పోను 2 ఎకరాల 39 గుంటలను తమ పేరు మీది.

ఈ మధ్యే కుత్బూలపూర్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో గిఫ్ట్ డీడ్ గా మార్చుకున్నారు. దాంతో ఎలాగైనా లీగల్ సమస్యలు తల్లేతే అవకాశం ఉందని గ్రహించిన మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాండ్యూయర్ డెవలపర్స్ నిమ్మగడ్డ వారసులు చేసుకున్న గిఫ్ట్ డీడ్ తప్పుగా చేశారని ఎలాగైనా దాని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో అధికారరులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో  గిఫ్ట్ డీడ్ చేసిన సబ్ రిజిస్టార్‌పై స్టాంప్స్ అండ్ ఐజీకి ఫిర్యాదు చేయించి వాళ్లు సీలీంగ్ బాగోతం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లా రెవెన్యూ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్న సీలింగ్ భూముల వ్యవహారంలో ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిజమైన పటాదారుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్లు గా చూపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సి న అవసరం ఉంది. ఇదిలా ఉండగా.. తాము ఎవరికీ డబ్బు ఇవ్వలేదని చెరుకూరి అరవింద్ చెప్పడం గమనారం.