28-01-2026 04:10:23 PM
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాసైనా నిరుద్యోగ SC, ST, BC, Minority అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కేంద్ర లైబ్రరీ సమావేశములో తెలియజేశారు. మూడు లక్షల ఆదాయం గలిగిన వారు tsstudycircle.co.in వెబ్సైటు ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణతో పాటు పోటీపరీక్షలకు సంబందించిన పుస్తకాలు, నోట్ బుక్స్, ప్రతినెలా కాస్మోటిక్ చార్జీలు ఇవ్వబడుతాయి.
రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో తరగతులు నిర్వహించ బడుతాయి. ఇప్పటి వరకు 230 పై చిలుకు ఉద్యోగాలు సాధించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం ఈ నెల 30 తేది చివరి అవకాశం. పూర్తి వివరాల కోసం 9494149416 ఫోన్ ద్వారా తెలుసుకో గలరు అని డైరెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ సెక్రటరీ పాల్గొన్నారు