calender_icon.png 18 January, 2026 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిబిజెడ్ కొత్త స్టోర్ ప్రారంభించిన రాశి ఖన్నా

17-01-2026 11:18:07 PM

హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా హిమాయత్ నగర్ లో సందడి చేసింది. చరిత్ర, సంస్కృతి , విలాసాన్ని ముడిపెట్టే ఒక చారిత్రాత్మక సందర్భంలో అత్యంత ప్రసిద్ధి చెంది ఆభరణాల బ్రాండ్ టిబిజెడ్-ది ఒరిజినల్ కొత్త షోరూమ్‌ను రాశి ఖన్నా ప్రారంభించింది.  టిబిజెడ్-ది ఒరిజినల్, 25 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా దీనిని లాంఛ్ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాల కొనుగోలుకు సంబంధించి  టిబిజెడ్- ది ఒరిజినల్ పంజాగుట్ట, కొండాపూర్ తో పాటు ఇప్పుడు హిమాయత్ నగర్ లోనూ ఖాతాదారులకు సేవలు అందించనుంది. ఈ సందర్భంగా పలు ఆఫర్లను కూడా ప్రకటించింది.

సమకాలీన వస్తువుల నుండి సాంప్రదాయ ఆభరణాల వరకు, టిబిజెడ్-ది ఒరిజినల్ యొక్క క్వాలిటీకి అంకితభావానికి ప్రతి డిజైన్ నిదర్శనంగా నిలుస్తుందనీ టిబిజెడ్-ది ఒరిజినల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ జవేరి చెప్పారు. వివాహానికి సంబంధించి సంప్రదాయలకు ప్రతీకగా అద్భుతమైన డిజైన్లను రూపొందించినట్టు వెల్లడించారు. బ్రైడల్ జ్యూవెలరీకి తమ బ్రాండ్ ఎంతో ప్రసిద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా టిబిజెడ్-ది ఒరిజినల్ యొక్క అత్యాధునిక తయారీ సౌకర్యాలలో రూపొందించబడిన వజ్రాల ఆభరణాల అద్భుతమైన కలెక్షన్ ను రాశి ఖన్నా ధరించింది. టిబిజెడ్– ది ఒరిజినల్ 25 సంవత్సరాల వేడుకలలో తాను కూడా భాగం కావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది.