హైదరాబాద్ లోని పలుచోట్ల వర్షం
16-05-2024 02:39 PM
హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల గురువారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లిలో భారీ వర్షం పడుతోంది. కాసేపట్లో నగరమంతా వర్షం కురిసే అవకాశముందని డీఆర్ఎఫ్ బృందం తెలిపింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రారంభమైనట్లు సమాచారం. రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయాని వాతావరణ కేంద్రం ప్రకటించింది.




