అమ్మకానికి మదర్‌డైయిరీ ఆస్తులు
చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
ఎల్బీనగర్, ఫిబ్రవరి 7: మదర్‌డైయిరీ సంస్థకు గుదిబండగా మారిన అప్పులను తీర్చడానికి సంస్థ ఆస్తులు విక్రయిస్తున్నట్లు మదర్‌డైయిరీ పాలకవర్గం తీర్మాణం చేసింది. డైయిరీ అభివృద్ధికి అడ్డంకిగా మారిన అప్పుల భారం తగ్గించుకోవడానికి స్థిరాస్తులు అమ్మక తప్పడం లేదని మదర్‌డైయిరీ(నార్మూల్) చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
హయత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మదర్‌డైయిరీ పాలకవర్గం 26వ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం కొలువుదీరక ముందే మదర్‌డైయిరీ నష్టాల్లో ఉందన్నారు. డైయిరీని లాభాల్లో నడిపించడానికి శాయశక్తులు కృషి చేస్తున్నా అప్పుల భారం గుదిబండగా మారిందన్నారు.
మదర్‌డైయిరీకి మొత్తంగా రూ.60 కోట్ల అప్పు ఉన్నదని మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సంస్థలో రూ.12 కోట్ల నిల్వతోపాటు స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పారు. బ్యాంకు రుణాలకు వడ్డీగా నెలకు రూ. 40 లక్షలు.. ఏడాదికి రూ.5 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు.
నల్లగొండ జిల్లాలోని చిట్యాల, మిర్యాలగూడలోని స్థిరాస్తులు విక్రయించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. తీర్మానాన్ని అమోదించాలంటే సంస్థ సభ్యులు మొత్తం 368 మంది రైతులు సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు.
దీనిపై ఎవరిపై ఒత్తిడి తేవడం లేదని చెప్పారు. నల్గొండ, చిట్యాల, మిర్యాలగూడలోని ఆస్తుల విక్రయానికి పది మందితో కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. కమిటీ సూచనలతో అస్తులను విక్రయిస్తామని చైర్మన్ మధుసూదన్‌రెడ్డి చెప్పారు.




