3 July, 2026 | 9:38 PM

Breaking News

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •  

అంగన్వాడి సెంటర్ పిల్లలకు అమ్మవడి

26-04-2025 07:32 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): బుడిబుడి నడకలు వేస్తూ వచ్చిరాని మాటలతో అప్పుడే ఓనమాలను పలికిస్తూ ఆలన పాలన చూస్తూ పిల్లలను తీర్చిదిద్దే ప్రతి ఒక అంగన్వాడి సెంటర్ అమ్మ వడిలాంటిదేనని అంగన్వాడి టీచర్ రుక్మిణి అన్నారు. శనివారం మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో అంగన్వాడి సెంటర్లో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ టీచర్ రుక్మిణి మాట్లాడుతూ... సెంటరులో ఈ.సి.సి.ఈ డే నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా పిల్లలకు ఆట పాటతో పాటు చక్కటి విద్యను చెప్పడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తల్లులు పాల్గొని వారి పిల్లల పట్ల అంగన్వాడి సేవల తోటి చాలా అభివృద్ధిలో ఉంటున్నారని ఎంతో సంతోషించారు. పిల్లలకు వారి అభివృద్ది కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్లో చదువుకున్న ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు సర్టిఫికెట్ ఇచ్చి పిల్లలను సంసిద్ధం చెయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు  తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆయా బాలమణి తదితరులు పాల్గొన్నారు.